వృషభరాజాల బల ప్రదర్శన పోటీలు
అయిజ: మండల కేంద్రంలో తిక్క వీరేశ్వర్వస్వామి జాతర, రైతు సంబరాల్లో భాగంగా సోమవారం అంతర్రాష్ట్రస్థాయి సీనియర్ విభాగం వృషభరాజాల బల ప్రదర్శన (బండలాగుడు) పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 11 జతల వృషభరాజులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తలపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా పల్కందొడ్డికి చెందిన ఖాజా హుస్సేన్ ఎద్దులు మొదటి, ఏపీలోని అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన ఎస్‌బీఆర్ బుల్స్ ద్వితీయ, నంద్యాల జిల్లా మాన్‌దిన్నెకు చెందిన కుందూరు రాంభూంపాల్‌రెడ్డి ఎద్దులు తృతీయ, బాపట్ల జిల్లా ఎనమెట్లకు చెందిన కేవీఆర్ బుల్స్ నాల్గవ, నంద్యాల జిల్లా కొత్తూరుకు చెందిన భీరం బుల్స్ ఐదో బహుమతి సాధించాయి.
జోగుళాంబ క్షేత్రాన్ని
దర్శించుకున్న ప్రముఖులు
అలంపూర్: ఐదో శక్తిపీఠం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సోమవారం గద్వాల సంస్థానాధీశుడు శ్రీకృష్ణ రాంభూపాల్, బుల్లితెర నటుడు, నిర్మాత శ్రీరామ్ (ఆర్యవర్ధన్) వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈఓ పురేందర్ కుమార్ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామికి ప్రత్యేక పూజల అనంతరం వారికి అర్చక స్వాములు తీర్ధప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆలయ ఈఓ శేషవస్త్రాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
వృషభరాజాల బల ప్రదర్శన పోటీలు
Comments
Please login to add a commentAdd a comment