రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచేందుకు పావులు కదిపింది. అందులో భాగంగా రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తనకున్న పాత పరిచయాలతో గద్వాలలో బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్యనాయకులను కాంగ్రెస్ పార్టీవైపు తిప్పుకున్నారు. మొదటగా గద్వాల మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన బీఎస్ కేశవ్, కొంతమంది కౌన్సిలర్లను చేర్చుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. దీంతో గద్వాల కాంగ్రెస్ పార్టీలో పాత కథే మొదలైంది. బండ్ల వర్సెస్ సరిత పోటీపడుతూ.. సందర్భం వచ్చినప్పుడల్లా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. అదే విధంగా ఆ పార్టీలో సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సైతం అటు అలంపూర్ నియోజవర్గంతో పాటు గద్వాలలో కూడా చురుకుగా పావులు కదపుతూ జిల్లాపై పట్టు సాధించేందుకు పోటీపడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment