పారదర్శకంగా ఉపాధి హామీ పనులు
ఎర్రవల్లి: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ నర్సింగరావుతో కలిసి కలెక్టర్ సందర్శించి ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వాటిని సమర్ధవంతంగా ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడాలని అన్నారు. గ్రామ పంచాయతీలలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం క్రింద మంజూరైన పనులకు సంబంధించి ఎస్టిమేషన్ విధానం, పనుల అమలు, చెల్లింపు వివరాలను సమీక్షించి అన్ని వివరాలు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. మండలంలో ఇప్పటి వరకు హరితహారం కింద నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల వివరాలు, వాటి నిర్వహణకు జరిగిన ఖర్చులను సమీక్షించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద అవసరమైన మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ నిధుల్లో 60శాతం వ్యవసాయ అనుబంధ పనులకు కేటాయించాలన్నారు. మెజర్‌మెంట్ బుక్, మస్టర్‌రోల్‌ను పరిశీలించి, అన్ని రిజిస్టర్లు స్నష్టంగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ కింద చేపట్టిన అన్ని పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పనుల పురోగతికి సంబందించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఎంపీడీఓ కార్యాలయంలో పర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపుదల కోసం రూ.30 వేలతో నిర్మిస్తున్న ఇంకుడు గుంత పనులను పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, ఎపీఓ శివజ్యోతి, టీఏలు కృష్ణయ్య, లావణ్య, హుస్సేన్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి నిధులు వినియోగించుకోవాలి
కలెక్టర్ బీఎం సంతోష్
Comments
Please login to add a commentAdd a comment