రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణ చేయాలి
గద్వాల క్రైం: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఆయా కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని.. సదరు ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్రపూరితంగా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారనే కోణంలో సమగ్రంగా విచారణ చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చూడాలని, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ, పైవ్రేటు భూములు కబ్జాకు పాల్పడినట్లు వచ్చే ఫిర్యాదులపై శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదాలు, అనుమానాస్పద కేసులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పని చేయాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి తరలించినా.. అక్రమంగా రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట వంటిని రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్టమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన అనర్హత వేటు తప్పదన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయా స్టేషన్‌లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్‌ఐలు, కళ్యాణ్‌కుమార్, శ్రీకాంత్, వేంకటేష్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment