
ఓం నమః శివాయ
వివరాలు 8లో u
● జిల్లాలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు
● రుద్ర నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
గద్వాలటౌన్: ఓం నమః శివాయ.. హరహర మహాదేవ శంభో శంకర.. నామస్మరణతో పల్లె, పట్టణం మార్మోగింది. బుధవారం మహా శివరాత్రి వేళ భోళా శంకరుడిని భక్తులు భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. అభిషేకాలు, దీపారాధన, నైవేధ్యాలు సమర్పించి శివయ్యను కొలిచారు. ఉదయాన్నే పుణ్య స్నానాలు ఆచరించి శివాలయాలకు తరలివెళ్లారు. భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అందులోను బుధవారం మహా శివరాత్రి పర్వదినం రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శైవక్షేత్రాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివుడి దర్శనాలు సాగాయి. రాత్రి శివ కల్యాణాలు కనులపండువగా జరిగాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. జిల్లా కేంద్రంలోని స్థానిక నల్లకుంట కాలనీ, తెలుగుపేట కాలనీలలోని శివశంకర ఆలయాలు, కన్యాకాపరమేశ్వరి, వీరభద్రస్వామి, మార్కెండేయస్వామి, నందీశ్వర, భీమలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. మహా శివరాత్రి సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెల్లవారుజామున నది అగ్రహారానికి వెళ్లి అక్కడ కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడి స్పటిక శివలింగానికి అలాగే, తెలుగుపేటలోని శివాలయం, నందీశ్వర, భీమలింగేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, హోమాలు చేపట్టారు. గ్రామాలలో ఉన్న ఆలయాల దగ్గర భక్తుల సందడి కనిపించింది. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి జాగరణ చేశారు.
బీచుపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆలయాలు మహాశివరాత్రిని పురస్కరించుకొని బుధవారం భక్తులతో కిక్కిరిశాయి. శివాలయం, అభయాంజనేయస్వామి ఆలయాల్లో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం వంటి తదితర పూజలు నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాలతో పాటు గద్వాల, పెబ్బేర్, వనపర్తి, కొత్తకోట, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే బీచుపల్లి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు. అనంతరం శివాలయం, కోదండరామస్వామి, సరస్వతీదేవి అభయాంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ
Comments
Please login to add a commentAdd a comment