
శివజ్యోతి దర్శనం..
● జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర క్షేత్రానికి తరలివచ్చిన భక్తజనం
● ప్రత్యేక పూజల అనంతరం దీక్ష విరమించిన మాలధారులు
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరుడి క్షేత్రంలో బుధవారం అర్ధరాత్రి భక్తులకు శివజ్యోతి దర్శనం కలిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలతోపాటు అర్ధరాత్రి శివజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. మాలధారులు పంచాక్షరి నామస్మరణతో శివజ్యోతిని నింగిలోకి వదిలగా హరహర మహాదేవ.. శంభో శంకర.. ఓం నమః శివాయ నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, మాలధారులు లింగోద్భవ సమయంలో నింగికెగిరిన శివజ్యోతిని వీక్షించారు. అంతకుముందు భక్తులు శివజ్యోతిని తలపై ఉంచుకొని నగర సంకీర్తనలు చేస్తూ.. బాణసంచా పేలుస్తూ భారీ ఊరేగింపుగా పట్టణంలో నుంచి ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వర ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయంపై సిద్ధం చేసిన జ్యోతిని నింగిలోకి వదిలారు. జ్యోతి దర్శనం అనంతరం మాలధారులు లింగోద్భవ కాలంలో దీక్ష విరమణ చేశారు.

శివజ్యోతి దర్శనం..

శివజ్యోతి దర్శనం..

శివజ్యోతి దర్శనం..
Comments
Please login to add a commentAdd a comment