రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో బుధవారం రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. మొత్తం 80 మంది బాలికలు, 110 మంది బాలుర హాజరు కాగా.. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్యాట్రన్, న్యాయవాది మనోహర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ ఎంపికలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి.. జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్ మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9నుంచి 16వ తేదీ వరకు 40వ యూత్ నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ ఉంటుందని తెలిపారు. తెలంగాణ బాలబాలికల జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నసరుల్లా హైదర్, చైర్మన్ మీర్ అర్షద్‌అలీ, ఉపాధ్యక్షులు సయ్యద్ షరీఫ్ అలీ, సుబాన్‌జీ, కార్యనిర్వాహక కార్యదర్శి మీర్ ఖాలిద్‌అలీ, కోశాధికారి ఎండీ ఇలియాజ్, పీడీ ముకర్రం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment