ఉపాధి అవకాశాలు కల్పించాలి
గద్వాల: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంతోపాటు.. రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2వ తేదీన వనపర్తికి సీఎం రానున్న నేపథ్యంలో ఉద్యోగమేళా, రుణమేళా స్టాల్స్ ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్ధేశించిన లక్ష్యం మేర అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాన్ని సాధించాలన్నారు. మార్చి 1వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈమేళాలో యువత అధిక సంఖ్యలో హాజరయ్యేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అదేవిధంగా రుణ మంజూరు, లక్ష్యాలు, ఇప్పటి వరకు మంజూరీ అయిన రూ.200 కోట్ల రుణాల వివరాలను సమగ్రంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. 2024డిసెంబర్–2025 ఫిబ్రవరి వరకు మంజూరైన రుణాలపై పూర్తి స్థాయి నివేదిక రూపొందించి ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఎల్‌డీఎం అయ్యపురెడ్డి వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment