గద్వాల: జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు ఈనెల 28వ తేదీ నుంచి భూమిపూజ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రతిమండలానికి ఎంపికై న గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు భూమిపూజ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు నివాసం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరీ చేస్తుందని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరీ అయినట్లు వీటిని అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీడీవోలు, హౌసింగ్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్లకు సంబంధిచిన మార్కౌవుట్ ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment