కాలుష్య కారకం
కాలం చెల్లిన వాహనం..
●
15 ఏళ్లుపై బడిన వెహికిల్స్‌తో తీవ్రమైన కాలుష్యం
ఆదేశాలు ఇచ్చాం..
ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ ఎంవీఐలు, ఆర్టీఓలకు 15 ఏళ్లు పైబడిన వాహనాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసి అలాంటి వాహనాలు గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 15, 20 ఏళ్లు పైబడిన వాహనదారులు ప్రతిఒక్కరూ వారి వాహనాల రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువన్ లేని వాహనాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలో పట్టుబడితే సీజ్ చేస్తాం. ప్రధానంగా రోడ్లపై వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ సీటు బెల్ట్, హెల్మెట్ తప్పక ధరించాలి.
– కిషన్, డీటీసీ ఉమ్మడి జిల్లా
● రోగాల విజృంభణ నేపథ్యంలో
కట్టడికి చర్యలు
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
32,181 వాహనాలు
● గ్రీన్ ట్యాక్స్ భారీగా పెంచిన ప్రభుత్వాలు
పాలమూరు: భారీగా పెరిగిపోతున్న వాహన కాలుష్యంతో వాతావరణంలో సమతుల్యత లోపించి కొత్త రకం జబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15, 20 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ భారీగా విధిస్తోంది. 15 ఏళ్లు దాటిన ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.2 వేలు, 20 ఏళ్లు దాటిన బైక్‌లకు రూ.5 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక 15 ఏళ్లు దాటిన కార్లకు రూ.5 వేలు, 20 ఏళ్లు దాటిన వాటికి రూ.10 వేల పన్నులు వసూలు చేయాలని ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కార్లు, ద్విచక్రవాహనాలు 20 ఏళ్లు పైబడినా అలాగే రోడ్లపై నడుపుతున్నారు. అలా కాలం చెల్లిన వాహనాల నుంచి భారీస్థాయిలో పొగ విడుదల కావడంతో మిగిలిన వాహనదారులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
● ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాహనం కలిగి ఉండటం సర్వసాధారణమైపోయింది. వాహనం ఉండటం సరే.. దాని నుంచి వచ్చే కాలుష్యమే పర్యావరణానికి హాని కలిగిస్తోంది. వాహనాల నుంచి వచ్చే కార్బన్ మోనాకై ్సడ్ వల్ల ఓజోన్ పొర బాగా దెబ్బతింటోంది. వాహనాల నుంచి మోతాదుకు మించి కాలుష్యం విడుదల కాకుండా ఆర్టీఏ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. డీజిల్ వాహనాల నుంచి 60 శాతానికి మించి పొగ రాకూడదు. అలాగే పెట్రోల్ వాహనాల నుంచి ద్విచక్రవాహనమైతే 3.5శాతం, కార్లు ఇతర వాహనాలైతే 4.5 శాతానికి మించరాదు. కానీ, కాలం చెల్లిన వాహనాల నుంచి అధిక మోతాదులో పొగ విడుదలవుతుంది. దేశ రాజధానిలో వాహనాల వినియోగం ఎక్కువ కావడంతో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకరోజు కొన్ని వాహనాలను మాత్రమే రహదారి మీదికి అనుమతిస్తున్నారు. మన పట్టణంలోనూ రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలోని పలు గుంతల రహదారులతో పాటు వాహనాల పొగతో వెలువడే కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ వాధ్యలతో ఇబ్బంది పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 15ఏళ్లు పైబడిన
అన్ని రకాల వాహనాల వివరాలు
జిల్లా వాహనాలు
మహబూబ్‌నగర్ 13,965
నాగర్‌కర్నూల్ 5,295
వనపర్తి 4,059
జోగుళాంబ గద్వాల 3,672
నారాయణపేట 5,190
కాలుష్య కారకం
కాలుష్య కారకం
Comments
Please login to add a commentAdd a comment