పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
గద్వాల: పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9:30–12:30 పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,717మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా వారికి 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల్లో ఎలాంటి మాస్‌కాపీయింగ్ జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం 40మంది చీఫ్ సూపరింటెండెంట్స్, ముగ్గురు ఫ్‌లైయింగ్ స్వ్కాడ్స్, నాలుగు రూట్ ఆఫీసర్లు, 40 డిపార్ట్‌మెంటల్ అధికారులు, 14 సెంటర్ కస్టోడియన్స్, 40సిట్టింగ్ స్వ్కాడ్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుస్టేషన్ నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్షా అనంతరం సమాధాన పత్రాల బండిల్స్‌ను పోస్టాఫీసులకు తరలింపు ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతా నడుమ చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేయాలన్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించాలని, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయ, నర్సింగ్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఈవో అబ్దుల్‌గని, డిప్యూటీ జెడ్పీ సీఈవో నాగేంద్రం, డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment