ఫిట్‌నెస్ లేని బస్సులపై చర్యలు
గద్వాల క్రైం: ఫిట్‌నెస్ లేని ప్రవేటు స్కూల్ బస్సులలో విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్తే చట్టపరమైన చర్యలు తప్పవని గద్వాల ఎంవీఐ రాములు నాయక్ అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని జమ్మిచెడ్ రోడ్డుమార్గంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పలు స్కూల్ బస్సులు ఫిట్‌నెస్, పర్మిట్, సామర్థ్యం తదితర అనుమతులు లేకుండా విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. సామర్థ్యం లేని రెండు ప్రైవేటు స్కూల్ బస్సులను సీజ్ చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలు, పలు అనుమతి పత్రాలు లేకుండా నడుస్తున్న బస్సులకు జారిమానాలు విధించారు. గోవర్ధన్, గోవిందు, ఖాద్దర్ పాల్గొన్నారు.
ఎక్కువ కేసుల
పరిష్కారానికి కృషి
అలంపూర్: జాతీయ లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేద్దామని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ అన్నారు. అలంపూర్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో పోలీస్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ మిధున్ తేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్ లక్ష్యాలు, ఉద్ద్యేశాలను వారికి వివరించారు. పోలీసులు న్యాయవాదులు సమన్వయంతో కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అధిక కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు. సమావేశంలో సురేష్ కుమార్, సీఐలు రవిబాబు, టాటబాబు పాల్గొన్నారు.
సమగ్ర సస్యరక్షణతోనే అధిక దిగుబడులు
ఎర్రవల్లి: సమగ్ర సస్యరక్షణతోనే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని సీఐపీఎంసీ ఇన్‌చార్జ్ సునీత అన్నారు. శుక్రవారం ఇటిక్యాల మండలంలోని సాతర్ల రైతు వేదికలో కేంద్రియ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్‌శాఖ ఆధ్వర్యంలో పంటల సాగులో సమగ్ర సస్యరక్షణపై డీలర్లు, రైతులకు హెచ్‌ఆర్‌డీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఏఓ సక్రియనాయక్, జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్‌తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు ఎన్‌పిఎస్‌ఎస్ అనే మొబైల్ యాప్‌ను వినియోగించి వివిధ పంటలపై సులభంగా సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చునని సూచించారు. ప్రతి ఏడాది పంట మార్పిడి చేసుకోవాలని, పొలం చుట్టూ వలయంగా ఎర పంటలను వేసుకోవాలని, విత్తన శుద్ధి చేయాలని, అవసరం మేరకు మాత్రమే పురుగు మందులు పిచికారీ చేయాలన్నారు. అనంతరం మిరప పంట సందర్శించి లింగాకర్షక బుట్టల యొక్క ఆవష్యకతపై అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment