జిల్లా కేంద్రంలోని రథశాల ఎదురుగా, కళాశాలకు వెళ్లే రహదారి వద్ద, గంజి చౌరస్తా వద్ద నిత్యం ప్రయాణికులు వందల సంఖ్యలో ఉంటారు. వీటితోపాటు ఆస్పత్రి ఎదురుగా, డ్యాంకు వెళ్లే దారిలో ఉన్న సబ్‌స్టేషన్ దగ్గర బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తుంటారు. అంతేకాక రైల్వేస్టేషన్ క్రాస్‌రోడ్ దగ్గర ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రధాన రహదారి పోడువున ఉన్న గ్రామాల స్టేజీల దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తుంటారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు, చెట్లు లేకపోవడంతో రోడ్డుపైనే నిల్చుని ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గద్వాల, అయిజ, అలంపూర్, శాంతినగర్‌లలో బస్సు షెల్టర్లు లేకపోవడం వలన సమీపంలో ఉన్న దుకాణాలు, హోటళ్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తుంటారు. జిల్లా నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌శాఖ, ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు సంయుక్తంగా బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలి. బహుముఖంగా విస్తరిస్తోన్న జిల్లా కేంద్రంతో పాటు వాణిజ్య పరంగా వృద్ధి సాధిస్తున్న అయిజ, శాంతిగనర్, ఎర్రవల్లి చౌరస్తా ఆయా మండల కేంద్రాలలో ప్రయాణికుల అవస్థలను గుర్తించి అవసరమైన చోట బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment