గద్వాల: జిల్లాలో సాగుచేసిన చివరి ఆయకట్టు ఎండిపోకుండా సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో మాట్లాడారు. రాబోయే పదిరోజుల్లో అధికారులు క్షేత్రసాయిలో పర్యటించి రైతులతో మాట్లాడాలన్నారు. ఎక్కడెక్కడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయో తెలుసుకుని అందుకనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా క్రమం తప్పకుండా గురుకులాలు, రెసిడిన్షియల్ పాఠశాలలను తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ట్రాన్స్కో సీఈ భాస్కర్, ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ రహీముద్దీన్, డీఏవో సక్రియనాయక్, అక్బర్‌బాష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment