ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి
అయిజ: మహిళలు ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని ఆర్‌బీఐ హైదరాబాద్ ఆర్‌ఓ అజయ్ మణికంఠ అన్నారు. సోమవారం ఆర్‌బీఐ ఆధ్వర్యంలో డిజిటల్ పేమెంట్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయిజ బ్రాంచ్ ఆవరణలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఆయనతోపాటు ఆర్‌ఓ హర్షవర్ధన్ హాజరయ్యారు. ఈసందర్భంగా వారు బ్యాంకులు అందించే వివిధ రకాల సేవలు, సౌకర్యాల గురించి వివరించారు. ఏటీఎం రూపే కార్డులను వాడి సమయాన్ని ఆదా చేసుకోవాలని కోరారు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల గురించి వివరించారు. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ లావాదేవీలు జరుపుకోవాలని కోరారు. బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో రుణాలు చెల్లించి తిరిగి రుణాలు పొందాలని కోరారు. మోసపూరిత ఫోన్ కాల్‌ను గమనించాలని, సైబర్ నేరగాళ్ల భారినుంచి మోసపోతే 1930 నెంబర్‌కి ఫోన్ చేసి పిర్యాదుచేయాలని సూచించారు. కార్యక్రమంలో హర్షవర్ధన్, గద్వాల ఏఎంహెచ్ మేనేజర్ సీవీ రమేష్, అయిజ బ్రాంచ్ మేనేజర్ రూపశ్రీ, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ హంసిని, క్యాషియర్ ఋషికేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.7,061
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,061, కనిష్టంగా రూ.4,691 ధరలు లబించాయి. అదేవిదంగా కందులు గరిష్టంగా రూ.6,851, కనిష్టంగా రూ.5,400, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,361, కనిష్టంగా రూ.2,001, పెబ్బర్లు రూ.6,500, జొన్నలు రూ.3,601, మినుములు రూ.7.417 ధరలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment