దాహార్తి తీరేదెలా..? | - | Sakshi
Sakshi News home page

దాహార్తి తీరేదెలా..?

Published Thu, Mar 20 2025 1:09 AM | Last Updated on Thu, Mar 20 2025 1:07 AM

వేసవి సమీపిస్తున్న వేళ

మూగజీవాలకు కరువైన

నీటి తొట్టెలు

రాజోళి: వేసవి కాలం సమీపిస్తుందంటే జీవులన్నీ దాహార్తితో గుక్కెడు నీళ్ల కోసం పరితపిస్తుంటాయి. ఆ క్రమంలో మూగజీవాల కోసం వేసవిలో ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనుషులతో పోలిస్తే మూగ జీవాల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వమే ప్రత్యేక అవసరాలను గుర్తించి, సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. జిల్లాలోని వేలాది పశువులకు రానున్న రోజుల్లో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఇంకా ఈ చర్యలు ప్రారంభించలేని పాడి రైతుల నుండి, వ్యవసాయ దారుల నుండి వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్చి మాసం గడుస్తుండటంతో ఎండలు మరింత ముదిరే అవకాశముంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, గ్రామాల్లో ప్రత్యేకంగా ఆవులు, ఎద్దులు, గేదెలు, మేకలు నీరు తాగేందుకు వీలుగా ట్యాంకులు, నీటి తొట్టెలు నిర్మించాల్సి ఉంది. కాగా వాటిపై ఎలాంటి కదలిక లేకపోవడంతో ముందు రోజుల్లో పశువులు దాహార్తితో ఇబ్బందులు పడతాయనే ఆందోళన గ్రామాల్లో నెలకొంది.

217 గ్రామాలు.. 7.71 లక్షల మూగజీవాలు

జిల్లాలో వేల సంఖ్యలో పశు సంపద ఉంది. మొత్తం 217 గ్రామాల్లో గేదెలు 52,248, ఆవులు ఎద్దులు కలిపి 75,463, మేకలు 67,568, గొర్రెలు 5,76,000 మొత్తం 7.71లక్షలు ఉన్నాయి. వీటికోసం ప్రత్యేకంగా ట్యాంకులు అవసరం లేకపోయిన్పటికీ, చాలా వరకు బయటకు వెళ్లి మేత మేసే పశువులకు, గ్రామీణ ప్రాంతాలతో పాటు, గ్రామం బయట ఉండే జీవాలకు తప్పకుండా నీటి అవసరముంటుంది. దాని కోసం గ్రామంలో పశువులు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో, నీటి వనరులుండి, పశువలకు నీరు తాగేందుకు అనువుగాని చోట ప్రత్యేకంగా ట్యాంకులు, నీటి తొట్టెలు నిర్మిస్తారు. అలాంటివే జిల్లాలో 128 మాత్రమే నిర్మించగా, అవి కూడా ఏళ్ల కాలం కింద నిర్మించినవి కావడంతో ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిలో నీరు నింపితే అవి వృథాగా కిందకు పోవడమే కాక, పశువుల దాహార్తి తీర్చడంలేదు. జిల్లాలో ఉన్న పశువుల సంఖ్యకు, నిర్మించిన నీటి తొట్టెలకు అసలు పొంతనే లేకుంది. ఇప్పటికే చాలా చోట్ల రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో సొంతంగా నిర్మించుకోగా మరికొన్ని చోట్ల పూర్తిగా శిథిలమై, అసలు ఉపయోగంలోనే లేవు. నిర్మించిన 128లో కూడా 57 తొట్టెలు మరమ్మతులో ఉండగా,38 తొట్టెలలో అసలు నీరే పోయడం లేదు. ఇక మిగిలిన 75 మాత్రమే వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా, అధికారులు 357 తొట్టెలు నిర్మించాల్సి ఉందని ప్రతిపాదనలు పంపగా నేటి వరకు ఎలాంటి మంజూరు కాలేదు.

జిల్లాలో నీటి తొట్టెల వివరాలిలా..

కొత్తవి నిర్మించాలి

వేసవి కాలం ప్రారంభం అవుతుంది. గ్రామాల్లో పశువులకు నీరు తాగేందుకు వనరులునన్నప్పటికీ, ఎండలు ముదిరేకొద్ది అవి పూర్తిగా ఎండిపోతాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే గ్రామాల్లో తొట్టెల నిర్మాణాలు చేస్తే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. గ్రామాల్లో ఉన్న తొట్టెలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటికి మరమ్మతులు, అవసరమైతే కొత్తగా నిర్మించాలి. చాలా వరకు రైతులు బోర్ల దగ్గరే షెడ్లు నిర్మిస్తున్నప్పటికీ బయటకు వెళ్లే పశువులకు ఇబ్బందులు తప్పడం లేదు.

– బాను, పాడి రైతు, శాంతినగర్‌

జిల్లాలో వేల సంఖ్యలో పశువులు

217 గ్రామాల్లో 128 తొట్టీలు మాత్రమే

అందుబాటులో..

శిథిలావస్థకు చేరినవి కొన్ని..

పర్యవేక్షణ కరువై మరికొన్ని నిరుపయోగం

357 తొట్టెలకు ప్రతిపాదనలు పంపినా మంజూరుకాని వైనం

ఇబ్బందులు రానివ్వం

పశువులకు నీటి అవసరాలు ఉన్నప్పటికీ, పాడి రైతులు తమ షెడ్ల దగ్గర, ఇళ్ల దగ్గర బోర్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వేసవిలో కొంత నీటి కొరతను అధిగమిస్తున్నారనే చెప్పవచ్చు. కానీ బయటకు వెళ్లే పశువులకు ట్యాంకుల విషయంలో జిల్లాలో పలు చోట్ల ఇ బ్బందులు ఉన్నాయనే ఆలోచనతో గతంలోనే నీటి తొట్టెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. ఈ వేసవిలో ఎక్కడ పశువులకు తాగునీ టి ఎద్దడి రాకుండా చూస్తాం. – వెంకటేశ్వర్లు,

జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి

దాహార్తి తీరేదెలా..? 1
1/1

దాహార్తి తీరేదెలా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement