అలంపూర్: పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఎస్టీఓలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని నియోజకవర్గ రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు సదానందమూర్తి, ఎం. మద్దిలేటి, కేశవ ఆచారి తెలిపారు. అలంపూర్ పట్టణంలోని బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని, మీ–సేవ ద్వార ఆన్‌లైన్‌లో పొందిన లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్ ఎస్టీఓలో సమర్పించని పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ ఈ నెల 25వ తేదీ లోగా ఎస్టీఓలో లైఫ్ సర్టిఫికెట్ తప్పక సమర్పించాలన్నారు. లేదంటే పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్‌కు మార్చి నెల పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉందని, నిర్ణీత సమయంలోపు పెన్షనర్స్, ఫ్యామిలి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్స్ తప్పక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
మానవపాడు: మండలంలోని పెద్దపోతులపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన జి.ప్రభావతి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను కలెక్టర్ ఆదేశానుసారం ఆమెను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీఓ భాస్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సదరు కార్యదర్శి విధులకు సరిగా హాజరుకాకపోవడంతోపాటు ఇంటి పన్ను 20శాతం కూడా వసూలు చేయలేదని తెలిపారు.
హామీలు అమలు చేయాలి
గద్వాల: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆశాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశాలకు రూ.18వేల ఫిక్స్‌డ్ జీతాన్ని ఇవ్వాలన్నారు. అదేవిధంగా పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం, ఏఎన్‌ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు పదోన్నతలు కల్పించాలన్నారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తో పాటు సగం పెన్షన్ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఆశాల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో కాంతమ్మ, పద్మ, నాగప్రమీల, రేణుక, సునీత, అభేద, శ్వేతా, జయలక్ష్మీ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి