లక్ష్యానికి అడ్డంకులు..! | - | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి అడ్డంకులు..!

Published Sat, Mar 22 2025 1:20 AM | Last Updated on Sat, Mar 22 2025 1:15 AM

పన్ను వసూళ్లలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లు

రెండు వారాల్లో పెరిగిన వేగం

ఆర్థిక సంవత్సరం మరో 12 రోజుల్లో ముగుస్తోంది. దీంతో పన్నుల వసూళ్లల్లో కమిషనర్‌ దశరథ్‌, రెవెన్యూ అధికారులు దూకుడు పెంచారు. బడాబకాయిదారుల జాబితాను చేతపట్టి అధికారులు నేరుగా దుకాణాలకు వెళ్తున్నారు.. ఆస్తిపన్ను చెల్లించే వరకు కట్టు కదలడం లేదు. ఈ క్రమంలో దుకాణాదారులు మున్సిపల్‌ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మాజీ కౌన్సిలర్లు, రాజకీయ నాయకుల సిఫార్సులను పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు రోజువారి లక్ష్యాలు నిర్దేశిస్తుండటంతో... వారి ఆదేశాల మేరకు పన్ను వసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గడిచిన రెండు వారాలుగా పన్ను వసూళ్లుల్లో వేగం పెరిగింది.

గద్వాలటౌన్‌: ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది గద్వాల మున్సిపల్‌ అధికారుల పరిస్థితి. పట్టణంలో పన్ను వసూళ్లకు ఉన్నతాధికారులు లక్ష్యాలు విధించారు. రోజువారి వసూళ్లకు రాజకీయ నేతలు మోకాలడ్డుతున్నారు. ఎవరి దగ్గరకు వెళ్లినా మాజీ కౌన్సిలర్లు, లేదా పెద్ద రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు చేయిస్తున్నారు. లేదా చెల్లించమని బెదిరిస్తున్నారు. దీంతో పన్నులు వసూలు కాక ఉన్నతాధికారులకు సమాధానాలు చెప్పలేక నలిగిపోతున్నారు. ఇదీ జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో అధికారుల పరిస్థితి.

వంద శాతం పన్ను వసూలు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు

ఇరువురి మధ్య నలుగుతున్న మున్సిపల్‌ అధికారులు

జిల్లా కేంద్రంలో పన్ను వసూలైంది 46.4 శాతమే..

నోటీసులు జారీ చేస్తున్నాం..

ఆస్తిపన్ను నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించడానికి అధికారులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా పన్ను వసూళ్ల వేగం పెరిగింది. బడా బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. ప్రస్తుతం వారు పన్ను చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నెలాఖరులోగా వందశాతం పన్ను వసూళ్లు చేస్తాం.

– దశరథ్‌, కమిషనర్‌, గద్వాల

లక్ష్యానికి అడ్డంకులు..! 1
1/1

లక్ష్యానికి అడ్డంకులు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement