
యువతకు స్ఫూర్తి భగత్‌సింగ్
గద్వాల: ప్రజా పోరాటాలతోనే పీడిత ప్రజలకు విముక్తి లభిస్తుందని భగత్‌సింగ్ స్ఫూర్తితో అందరూ ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. ఆదివారం భగత్‌సింగ్ 94వ వర్థంతి సందర్బంగా పార్టీ కార్యాలయంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఉప్పేరు నర్సింహా, అంజి, తిమ్మప్ప, పురుషోత్తం వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో...
బ్రిటీష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడిన గొప్ప దేశభక్తుడు భగత్‌సింగ్ అని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. ఆదివారం భగత్‌సింగ్ 94వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, రంగన్న, పరమేష్, తిమ్మప్ప, వెంకటేష్, నాగన్న, రామన్న తదితరులు పాల్గొన్నారు.
భగత్‌సింగ్ ఆశయ సాధనకు కృషి
గద్వాలటౌన్: భగత్‌సింగ్ ఆఽశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న భగత్‌సింగ్ విగ్రహానికి విద్యార్థి సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భగత్‌సింగ్ చిన్న వయస్సులోనే స్వాతంత్య్రం కోసం పోరాడి ఉరికంబం ఎక్కిన పోరాట యోధుడని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు. భగతత్‌సింగ్ స్ఫూర్తితో చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.