
నాలుగు తరాలుగా..
సంతాన వేణుగోపాలస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా మా తాత బోరవెల్లి కేశవాచార్యులు కొనసాగారు. తదనంతరం మా తండ్రి బోరవెల్లి ప్రకాషమాచార్యులు, వారి తర్వాత నాతో పాటు మా సోదరుడు రాఘవాచార్యులు ఆలయంలో భక్తులకు ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా ఉగాది విశిష్టతను వివరిస్తూ వస్తున్నాం. ఈ ఏడాది వచ్చే ఉగాదిని శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటారు. ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటల స్థితిగతులు, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలోని యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అనే అంశాలను వివరిస్తాం. వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలు తెలుపుతాం.
– బోరవెల్లి పవన్‌కుమార్ ఆచార్యులు, గద్వాల