అలంపూర్/ఎర్రవల్లి: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈఓ పురేందర్‌కుమార్, ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ముందుగా జోగుళాంబ అమ్మవారి, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు.
భక్తిశ్రద్ధలతో చండీహోమం
అమావాస్యను పురస్కరించుకొని జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శనివారం చండీ హోమాలు నిర్వహించగా 178 మంది భక్తులు పాల్గొన్నారు.
భక్తులతో కిక్కిరిసిన బీచుపల్లి పుణ్యక్షేత్రం
ఎర్రవల్లి: అమావాస్యను పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని పలు ఆలయాలు శనివారం భక్తులతో రద్దీగా మారాయి. అభయాంనేయస్వామికి ఆలయ ప్రధాన అర్చకులు అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు శివాలయం, కోదండరామస్వామి, సరస్వతీదేవితో పాటు అభయాంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆలయాల్లో ప్రముఖుల ప్రత్యేక పూజలు
ఆలయాల్లో ప్రముఖుల ప్రత్యేక పూజలు