మోదం.. ఖేదం | - | Sakshi
Sakshi News home page

మోదం.. ఖేదం

Published Tue, Apr 1 2025 12:54 PM | Last Updated on Tue, Apr 1 2025 3:33 PM

మోదం.

మోదం.. ఖేదం

90 శాతం ఆస్తి పన్ను వసూళ్లతో అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి ముందంజ

గద్వాలలో

ఎందుకీ పరిస్థితి

ఎనిమిది నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన కమిషనర్‌కు పాలకవర్గానికి మొదటి నుంచి పోసక లేదు. పాలకవర్గం కనుసన్నల మధ్య నడిచే సిబ్బంది మొదట్లో పన్ను వసూళ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పాలకవర్గం గడువు ముగిసిన తరువాత కఠినంగా వ్యహరించిన కమిషనర్‌కు రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. బకాయిలు ఎక్కువగా ఉండటం, వీటితో పాటు సిబ్బంది అరకొరగా ఉండటం వలన పన్నులు సకాలంలో వసూలు చేయలేకపోయారు. కొత్తగా వచ్చిన వార్డు అధికారులకు సర్వేలు, ఎల్‌ఆర్‌ఎస్‌ తదితరమైన బాధ్యతలు అప్పగించడంతో వారు సైతం పన్ను వసూళ్లపై దృష్టి సారించలేదు. ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీ ఇచ్చిన చాలా మంది ప్రజలు వినియోగించలేకపోయారు. చివరలో వడ్డీమాఫీ రావడం వలన బడా బకాయిదారులు ముందుకు రాలేదు. ఫలితంగా పన్నుల వసూళ్ల మందగించింది.

56 శాతంతో లక్ష్యానికి దూరంగా గద్వాల మున్సిపాలిటీ..

ప్రభుత్వ కార్యాలయాల నుంచి నామమాత్రంగాపన్ను వసూలు

ముగిసిన ఆర్థిక సంవత్సరం వసూలు గడువు

గద్వాలటౌన్‌: ఈ ఏడాది ఎలాగైనా వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని సంకల్పించిన అధికారులు.. గద్వాల మినహా మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో మేర సఫలమయ్యారు. ఆశించిన స్థాయిలో పన్ను వసూళ్లు రాబట్టారు. గద్వాలలో మాత్రం లక్ష్యానికి దూరంగా నిలిచారు. ఉన్నతాధికారుల నుంచి పదే పదే ఒత్తిళ్లు రావడంతో అధికారులు ఈ మార్చిలో వసూళ్ల ప్రక్రియను కొంత వేగవంతం చేశారు. బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి పన్ను వసూలు చేశారు. అయినప్పటికి జిల్లా కేంద్రమైన గద్వాలలో పన్నుల వసూళ్లు పేలవంగా ఉన్నాయి. అటు ప్రభుత్వ కార్యాలయాల నుంచి చాలా ఏళ్లుగా పెండింగ్‌ బకాయిలు అరకొరే వసూలు కావడంతో అధికారులను నిరాశ కలిగించింది. అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపాలిటీలు వందశాతం లక్ష్యానికి స్వల్ప దూరంలో నిలిచాయి. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపుతో పన్ను వసూళ్లకు అడ్డుకట్ట పడింది. ఇప్పటి వరకు జిల్లాలోని గద్వాల మినహా.. అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆశించిన మేర పన్ను వసూలయ్యాయి.

అవరోధాలు ఎన్నో..

ఏటా ఆస్తిపన్ను వసూళ్లను చేపట్టి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతుంటారు. పట్టణంలోని ప్రతి నివాసగృహం, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి వాటి వైశాల్యాన్ని బట్టి పన్నును నిర్ధారిస్తారు. భువన్‌ సర్వే ద్వారా ప్రతి ఇంటిని జియోట్యాగింగ్‌ ద్వారా గుర్తించడంతో ఆయా గృహాల పరిణామాలకు చాలావరకు పన్ను పెరిగింది. వీటిని రాబట్టేందుకు అధికారులు గత రెండు నెలల నుంచి వసూళ్ల ప్రక్రియను చేపట్టారు. మొదట రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లు మాత్రమే వీటిని వసూలు చేశారు. కానీ లక్ష్యం పెద్దగా ఉండటం.. గృహాలు అధిక సంఖ్యలో ఉండటంతో గతనెల నుంచి సిబ్బంది సంఖ్యను పెంచారు. గద్వాల, అయిజలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వసూలు ప్రక్రియను చేపట్టారు. వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇళ్లు, దుకాణాలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పన్ను వసూలు చేశారు. పెండింగ్‌లో ఉన్న వాటికి నోటీసులు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం చివరల్లో ఆస్తిపన్నుపై హడావిడి చేయడం వలన అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోయారు. గద్వాలలో 56.53 శాతానికే పన్ను వసూళ్లు పరిమితం కాగా.. మిగిలిన మూడు మున్సిపాలిటీలలో 90 శాతం మార్కును దాటాయి.

గద్వాల పట్టణ వ్యూ

జిల్లా కేంద్రంలో చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలు, అయిజలో కొన్ని కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి సుమారు రూ.2 కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు నామమాత్రంగానే పన్ను వసూళ్లు జరిగింది. మొదటి నుంచి కూడా ప్రభుత్వ కార్యాలయాల నుంచి పన్ను వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభుత్వం కూడా వాటి నుంచి ఆస్తిపన్ను వసూళ్లు కాకపోయిన పెద్దగా పట్టించుకోవడం లేదు.

పన్ను వసూలు వివరాలిలా..

మున్సిపాలిటీ అసెస్‌మెంట్లు పన్ను వసూలైంది శాతం

డిమాండ్‌ (రూ.కోట్లలో)

గద్వాల 15,896 7.17 4.05 56.53

అయిజ 8,051 1.82 1.62 90.03

ప్రభుత్వ

కార్యాలయాల

పన్ను వసూళ్లు నాస్తి

మోదం.. ఖేదం 1
1/1

మోదం.. ఖేదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement