ఎర్రవలి: బీచుపల్లి పుణ్య క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఆలయంలో గరుడ పటంతో గ్రామ ప్రదక్షిణ, ద్వజస్తంభ స్నపనం, ధ్వజారోహణం, అష్టదిగ్భందనం, యాగశాలలో ప్రధాన కుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ట, మూర్తి మంత్ర హోమం, లఘుపూర్ణాహులి, తీర్థప్రసాద వితరణ వంటి పూజా కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. పలువురు దంపతులు సంతానం కోసం గరుడ ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.