
జగ్జీవన్‌రాం జీవితం.. ఆదర్శనీయం
గొప్ప విప్లవకారుడు..
సమాజంలో అసమానతలపై పోరాటం సలిపిన గొప్ప విప్లవకారుడు బాబు జగ్జీవన్‌రాం అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫ్‌లైఓవర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బోయ వెంకట్రాములు, గడ్డం కృష్ణారెడ్డి, బండారి భాస్కర్, శ్రీధర్‌గౌడ్, మురళి, కురుమన్న పాల్గొన్నారు.
గద్వాల: సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవిత పర్యాంతం శ్రమించిన గొప్ప మహనీయుడు దివంగత ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రాం అని కలెక్టర్ బీఎం సంతోష్ కొనియాడారు. శనివారం బాబు జగ్జీవన్‌రాం జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌రాం స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా.. స్వాతంత్య్రం అనంతరం దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారన్నారు. రక్షణశాఖ మంత్రిగా ఇండో, పాక్ యుద్ధ సమయంలో దేశానికి విజయాన్ని సాధించిపెట్టడంలో నాయకత్వం వహించినట్లు తెలిపారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సరోజ, ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రమేశ్‌బాబు, ఇన్‌చార్జి డీపీఓ నాగేంద్రం, తహసీల్దార్ మల్లిఖార్జున్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

జగ్జీవన్‌రాం జీవితం.. ఆదర్శనీయం