
జగమంతా రామమయం
జోగుళాంబ గద్వాల
కనుల పండువగా సీతారాముల కల్యాణ మహోత్సవం
వాతావరణం
ఉదయం నుంచే ఎండ ఎక్కువగా
ఉంటుంది. ఉక్కపోత పెరుగుతుంది.
ఆకాశం స్వల్పంగా మేఘావృతమై ఉంటుంది.
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు 8లో u
● జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగిన కల్యాణోత్సవాలు
● తరలివచ్చిన భక్తజనం
గద్వాలటౌన్: ఆకాశమంత పెళ్లిపందిరి.. భూలోకమంత కల్యాణ వేదిక.. అష్టదిక్కులా మార్మోగుతున్న మంత్రోచ్ఛరణల నడుమ జగదాభిరాముడు జానకి మెడలో మాంగల్యధారణ చేశారు. అంగరంగ వైభవంగా కోదండరాముని కల్యాణం జరిగింది. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో సీతారాముల కల్యాణ వేడుకలు నిర్వహించారు. అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయ ప్రాంగంణంలో, బీచుపల్లిలోని శ్రీ కోదండరామాలయంలో, ధరూర్ పాగుంట లక్ష్మివెంకటేశ్వరస్వామి ఆలయం, మల్దకల్ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం, గద్వాల మండలంలోని చెనుగోనిపల్లి, సంగాల, కొండపల్లి, గోనుపాడు, పరుమాల గ్రామాల్లో కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కోటలోని రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని మంత్రాలయ మఠం ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు.
వివిధ పార్టీల నేతల ప్రత్యేక పూజలు.
శ్రీరామనవమి వేడుకలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ తదితరులు వివిధ ఆలయాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్వాల, మల్దకల్, ధరూర్, కేటీదొడ్డి మండలాల్లోని ఆలయాలలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాముడు సుగుణాభిరాముడు, ఆయన జీవితం మానవలోకానికి ఆదర్శమని ఆయన అన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత జిల్లా కేంద్రంలోని ఆలయాలతో పాటు గద్వాల మండలంలో పలు గ్రామాలలో జరిగిన కల్యాణత్సవ ఘట్టానికి ముందు జరిగే పూజా కార్యక్రమాలలో ఆమె శాస్త్రోక్తంగా పూజలు చేశారు. భారతీయ సమిష్టి కుటుంబంలో పెద్ద కొడుకు, భర్త, అన్న, ప్రభువు, ఎలా ఉండాలో ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నతుడు కోదండరాముడన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు సుఖశాంతలతో జీవించాలని ఆ కల్యాణరాముడ్ని కోరుకున్నానని చెప్పారు.
మార్మోగిన రామనమం..
గద్వాలటౌన్: రామ నామంతో గద్వాల పట్టణ పురువీధులు మార్మోగాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో సాయంత్రం చేపట్టిన శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భజరంగ్‌దళ్, విశ్వహిందు పరిషత్, దర్మ ప్రసార సమితి, బీజేపీ నాయకులతో పాటు ఏబీవీపీ విద్యార్థులు, వివేకానంద సేవాదళ్, హిందూ ధార్మిక సంఘాలతో గద్వాల పట్టణం కాషాయరంగును సంతరించుకుంది. శ్రీరాముని పాటలు, ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తించారు. బాణసంచా కాలుస్తూ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎస్పీ మొగిలయ్య ఆధ్వర్యంలో యాత్రను ఎప్పటికప్పుడు సీఐ శ్రీనివాస్ బందోబస్తును పర్యవేక్షించారు. ఆరుగురు ఎస్సైలు, 50మంది పోలీసు సిబ్బంది శోభయాత్ర గస్తీలో పాల్గొన్నారు.
చారకొండ: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో ఆదివారం సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని జగదభిరాముడి కల్యాణ వైభోగాన్ని భక్తజనం కనులారా వీక్షించి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛరణాలు, మేళతాళాలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకురాగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సీతారామచంద్రస్వామిని పట్టువస్త్రాలతో చూడముచ్చటగా అలంకరించి.. మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా జరిపించారు. రాముడి దోసిట తలంబ్రాలు నీలపు రాసులుగా.. జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలైన వేళ సిర్సనగండ్ల క్షేత్రం భక్తిపారవశ్యంతో ఉప్పొంగింది. ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో గంటల తరబడి బారులుదీరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిర్సనగండ్ల దేవాలయం అభివృద్ధికి టూరిజం, సాంస్కృతికశాఖ నుంచి తక్షణమే రూ.2 కోట్లు విడుదల చేస్తామన్నారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి మరో రూ.50 కోట్ల మంజూరుకు కృషిచేస్తానన్నారు. దేవాలయ అభివృద్ధికి తమవంతు కృషిచేస్తామని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్యాణ మహోత్సవానికి దాదాపుగా 30 వేల మంది భక్తులు హాజరైనట్లు దేవస్థాన చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు తెలిపారు.
గద్వాలలో పూజలు నిర్వహిస్తున్న
ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి
అపర భద్రాద్రి సిర్సనగండ్లలో
ఉప్పొంగిన భక్తిపారవశ్యం
పట్టువస్త్రాలు సమర్పించిన
మంత్రి జూపల్లి కృష్ణారావు

జగమంతా రామమయం

జగమంతా రామమయం

జగమంతా రామమయం

జగమంతా రామమయం