కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఈ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ.రామ్‌మోహన్‌రావు వ్యవహరించగా, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా పి.కిరణ్ కుమార్(నెల్లూరు), రాష్ట్ర పరిశీలకుడిగా డి.రమణ రెడ్డి(నెల్లూరు) వ్యవహరించారు. ఎన్నికల అనంతరం పి. శ్రీనివాసరావు ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఎ.రామ్మోహన్‌రావు ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా పి.శ్రీనివాసరావు, సహాధ్యక్షుడిగా వి.చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్.ఈశ్వరి, వి.శ్రీనివాస్, వి.శశికుమార్, ఎం.విశ్వనాథం, కార్యదర్శిగా వై.భాస్కరావు ఎన్నికయ్యారు. అలాగే సంయుక్త కార్యదర్శులుగా నజీరా బేగం, బీవీవీ సత్యనారాయణ, ఆర్.జయకృష్ణ, కోశాధికారిగా వైఎన్ మూర్తి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎస్.శ్రీనివాస్, ఎ.పాపారావు, హైదర్ ఆలీపాషా, ఉదయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
కార్యదర్శిగా భాస్కరరావు
Comments
Please login to add a commentAdd a comment