మా అభివృద్ధిని వివరించాం
మేం చిన్నప్పుడు ఈ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకూ చదువుకున్నాం. మా గ్రామంలోని ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు లేక వేరే ఊరిలోని ప్రైవేటు పాఠశాలలో చేరాలనుకునే వాళ్లం. కానీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు–నేడుతో మా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. సకల సౌకర్యాలూ వచ్చాయి. విద్యా బోధనలోనూ మార్పులు రావడంతో ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడుతున్నాం. అందుకే మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మా ఉన్నతిని వివరించి, వారు ఇదే పాఠశాలలో చేరే విధంగా అవగాహన కల్పించాలని భావించాం.
– ఎలుగుబంటి నందిని, 9వ తరగతి విద్యార్థిని, పి.దొంతమూరు
మంచి అనుభూతి
చిన్నప్పుడు చదువుకున్న స్కూలుకు వెళ్లి మేం పాఠాలు చెప్పడం మంచి అనుభూతిని కలిగించింది. మా గ్రామ ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులను మా పాఠశాలకు ఆహ్వానించాలని అనిపించింది. చాక్లెట్లు తీసుకుని వెళ్లి, వారితో కొంతసేపు గడిపాం. పాఠాలు చెప్పి, మా పాఠశాలలో జాయిన్ అవ్వాలనే ఆసక్తిని పెంచాం. మమ్మల్ని చూసి వారు చాలా ఆనందపడ్డారు. తామూ అదే స్కూలులో చదువుకుంటామన్నారు. మేం మాట్లాడుతున్న ఇంగ్లిషు విని తాము కూడా అలా నేర్చుకుంటామంటూ ఆసక్తి చూపారు.
– కిల్లాడి సంధ్యారాణి,
9వ తరగతి విద్యార్థిని, పి.దొంతమూరు
మా అభివృద్ధిని వివరించాం
Comments
Please login to add a commentAdd a comment