మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మండపేట యువకుడి మృతి
మండపేట: పొట్టకూటికి మహారాష్ట్ర పనికి వెళ్లిన మండపేట యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నాలుగు రోజలు క్రితం జరిగిన ఈ విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు, స్నేహితులు తెలిపిని వివరాలిలా వున్నాయి. పట్టణంలోని కొండపల్లివారి వీధికి చెందిన పరమటి జితేంద్ర (33) మహారాష్ట్రలోని ఉద్గార్‌లోని ఓ ఫైనాన్స్ సంస్థలో కొంత కాలంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 7వ తేదీ ఉదయం ద్విచక్ర వాహనంపై లైన్‌కు బయలుదేరాడు. హల్నీ రహదారిపై వెళ్తున్న జితేంద్ర గండోపత్ దప్కా ప్రాంతానికి వచ్చేసరికి ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వేగంగా వస్తున్న నాలుగు చక్రాల గూడ్స్‌వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుణ్ణి స్థానికులు ఆసుపత్రికి చేర్చించారు. అక్కడ వైద్యం పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడని చెప్పారు. ఘటనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా పూర్తయ్యాక అక్కడి పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా మహారాష్ట్ర నుంచి అంబులెన్స్‌లో సోమవారం రాత్రి మండపేట తీసుకువచ్చారు. కాగా మృతునికి భార్య, మూడు నెలల పసిపాప వున్నారు. కుటుంబం కోసం కష్టపడటానికి వెళ్లి ఎప్పుడూ క్షేమంగా ఇంటికి చేరుకునే తన భర్త ఈసారి ఎవరికీ అందనంత దూరం వెళ్లిపోయారని గుండెలవిసేలా రోదించిన భార్యను చూటి చుట్టుపక్కల వారు కంటతడి పెట్టారు.
ఉపాధి హామీ పని చేస్తూ మహిళా కూలి మృతి
దేవరపల్లి: ఉపాధి పని చేస్తూ అస్వస్థతకు గురై పని ప్రదేశంలోనే మహిళా కూలీ మృతి చెందిన ఘటన దేవరపల్లి మండలం పల్లంట్లలో మంగళవారం జరిగింది. ఏపీఓ జీవీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పల్లంట్లకు చెందిన బొందల చంద్రమ్మ(53) 15 ఏళ్లుగా ఉపాధి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. మంగళవారం ఉదయం గ్రామంలోని రైతు పొలంలో ఫార్మ్ చెరువు తవ్వకం పనులకు వెళ్లిన చంద్రమ్మ కొద్దిసేపటికి అస్వస్థతకు గురైంది. వెంటనే వైద్యం కోసం గ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మండపేట యువకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment