బ్లడ్ బ్యాంక్‌లో తనిఖీలు
కాకినాడ క్రైం: కాకినాడలోని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహనాయక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ తనిఖీలలో భాగంగా బ్లడ్ బ్యాంక్‌ను పరిశీలించినట్లు తెలిపారు. రిజిస్టర్లు పరిశీలించామని, రిక్విజేషన్ ఫాంలోని వివరాల ఆధారంగా దాతలు, గ్రహీతలతో మాట్లాడి నిర్ధారించుకున్నట్లు తెలిపారు. బ్లడ్ స్టాక్ రికార్డు, డోనార్ రికార్డు, క్యాంప్ రిజిస్టర్స్, క్రాస్ మ్యాచింగ్, డిస్కార్ట్ రిజిస్టర్, బ్లడ్ ఇష్యూ రిజిస్టర్, పేమెంట్ రిక్విజేషన్ ఫాం, పేమెంట్ రిసీప్ట్స్, ఫిజికల్ స్టాక్, బ్లడ్ కలెక్షన్, మ్యాచింగ్, కాంపోనెంట్ ప్రిపరేషన్, వైరల్ స్క్రీనింగ్ రూంలను తనిఖీ చేసినట్లు తెలిపారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్‌లో నిబంధనలకు అనుగుణంగానే రక్తదాన సేవలు కొనసాగుతున్నాయని నిర్ధారించినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ వ్యాధుల నియంత్రణాధికారి(డీఎల్‌వో) డాక్టర్ రోణంకి రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment