అందరికీ ఉపయోగపడేలా..
సత్యగిరిపై విష్ణుసదన్‌లో 36 వివాహ మండపాలున్నాయి. ఇక్కడ వివాహాలు చేసుకునే పెళ్లిబృందాల వారికి అక్కడికి కాస్త దూరంలో ఉన్న హరిహర సదన్ సత్రంలో గదులు కేటాయిస్తున్నారు. విష్ణు సదన్ సత్రం పక్కన, ఆగమ పాఠశాల ముందున్న స్థలంలో 105 గదులతో నూతన సత్రం నిర్మిస్తే వివాహ బృందాల వారికి, భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని, ఆ మేరకు ఇక్కడే నిర్మించాలని నిర్ణయించారని సమాచారం. నూతన సత్రం నిర్మాణానికి గత జనవరిలో టెండర్లు పిలవగా 12 మంది కొటేషన్లు దాఖలు చేశారు. ఈ సత్రం గ్రౌండ్ ఫ్లోర్ అంతా వాహనాల పార్కింగ్‌కు వదిలేస్తారు. మొదటి, రెండు, మూడు ఫ్లోర్లలో ఫ్లోర్‌కు 35 చొప్పున 105 గదులు నిర్మింలని ప్రతిపాదించారు. సీతారామ సత్రం వద్ద ఎంత స్థలంలో నిర్మించాలని ప్రతిపాదించారో అంతే విస్తీర్ణంలో సత్యగిరిపై సత్రం నిర్మించే అవకాశం ఉంది. కమిషనర్ నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు వచ్చిన తరువాత సీతారామ సత్రం మరమ్మతులపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సత్యగిరిపై రూ.11.40 కోట్ల వ్యయంతో, 105 గదులతో నూతన సత్రం నిర్మించాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు కమిషనర్ కె.రామచంద్ర మోహన్ త్వరలోనే అన్నవరం దేవస్థానానికి ఉత్తర్వులు పంపనున్నారని తెలిసింది. దేవస్థానంలో ప్రస్తుతం ఉన్న 100 గదుల సీతారామ సత్రం శిథిలావస్థకు చేరడంతో దానిని పడగొట్టి ఆ స్థలంలోని సగ భాగంలో 4 అంతస్తుల్లో నూతన సత్రం నిర్మించాలని గత ఏడాది నిర్ణయించారు. ఆ మేరకు గత జనవరిలో టెండర్లు కూడా పిలిచారు. వీటి గడువు ముగిసి కూడా దాదాపు నెల రోజులైంది. వీటిని త్వరలోనే ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈ నెల మొదటి వారంలో దేవస్థానానికి వచ్చిన దేవదాయ శాఖ సాంకేతిక సలహాదారు పి.కొండలరావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్, సాంకేతిక కమిటీ సభ్యులు ఈ సత్రాన్ని పడగొట్టి కొత్త సత్రం నిర్మించే బదులు.. పాత భవనానికి మరమ్మతులు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సత్రం బాగానే ఉందని, మరమ్మతులు చేస్తే కనీసం మరో మూడేళ్లు భక్తులకు అద్దెకు ఇవ్వవచ్చునని చెప్పారు. అదే రోజు సత్యగిరిపై నూతన సత్రం నిర్మించేందుకు గాను ఆగమ పాఠశాల ముందు, విష్ణు సదన్ సత్రం పక్కన ఉన్న స్థలాలను వారు పరిశీలించారు. ఇదే విషయాన్ని వారు దేవదాయ శాఖ కమిషనర్‌కు కూడా తెలియజేశారు. ఈ మేరకు కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ నెల మూడో వారంలో అన్నవరం దేవస్థానం అధికారులతో విజయవాడలోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సీతారామ సత్రం స్థలానికి బదులు ఆ నిధులతో సత్యగిరిపై నూతన సత్రం నిర్మించే అవకాశాలపై చర్చించారు.
105 గదులతో నిర్మాణం
రూ.11.40 కోట్ల వ్యయం
త్వరలోనే టెండర్ల ఖరారు
సీతారామ సత్రానికి మరమ్మతులు
త్వరలో కమిషనర్ ఉత్తర్వులు
సత్యగిరిపై కొత్త సత్రం