
రుషి మార్గం మేలు
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అంశాలతో కూడినది పంచాంగం. ఖగోళంలో సూర్యచంద్రులు, ఇతర గ్రహాల పరిభ్రమణం వలన ప్రకృతిపరమైన మార్పులు, మన జీవితాల్లో అవి చూపే ప్రభావం అర్థం చేసుకోవడానికికి మన ప్రాచీన రుషులు ఏర్పరచిన విధానం పంచాంగ శ్రవణం. నూతన సంవత్సరాది వేళ మధుపాన సేవనంతో, అసభ్యకరమైన నృత్యాలతో అర్ధరాత్రి చిందులు వేయడం కాదు. రుషులు చూపిన శాసీ్త్రయ మార్గంలో గడపాలి.
– డాక్టర్ సీఎస్‌వీ రమణీ కుమారి,
రిటైర్డ్ తెలుగు పండిట్, రాజమహేంద్రవరం
తెలుగువారి తొలి పండగ
ఉగాది తెలుగు వారి మొదటి పండగ. ఈ రోజు నుంచే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజున పంచాంగ శ్రవణం వల్ల మహా ఫలితం కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలకు ప్రతీకగా తీపిచేదుల కలబోత అయిన ఉగాది పచ్చడిని స్వీకరించడం సంప్రదాయంగా వచ్చింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం నింపాలి.
– పిడపర్తి రవికుమార్ శర్మ, వేద పండితుడు,
పలివెల, కొత్తపేట మండలం

రుషి మార్గం మేలు