సాక్షి, నిజామాబాద్: 58 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నో గోసలు పడ్డాం. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపిండ్రు. ఎన్నో పోరాటాల అనంతరం మన రాష్ట్రం దేశంలోనే నంబవర్‌వన్‌గా ఉంది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి చేసిందెవరో విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని ప్రజకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు, వాళ్ల వెనక ఉన్న పార్టీల చరిత్ర చూడాలన్నారు. గురువారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్ వద్ద నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నాం. మిషన్ భగీరథ పథకంతో మంచినీళ్ల గోస తప్పిందన్నారు. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేసుకున్నామన్నారు. తెలంగాణ రాక ముందు తలసరి ఆదాయంలో 18వ స్థానంలో ఉన్న మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటవ స్థానంలో నిలిచామన్నారు.
కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతాం..!
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. అలాంటి కాంగ్రెస్‌ను మనం ఓటుతో బంగాళాఖాతంలో కలపాలలని సీఎం పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్‌లో మీ బొటనవేలు పెడితే తప్పా మీ భూమి రిజిస్ట్రేషన్ కాదు. ధరణి పోతే రైతుబంధు రాదు. దళారులు మోపైతారన్నారు.
సీఎంకు కూడా మీ భూమి తీసుకునే హక్కులేదు.. ధరణిలో సమస్యలను పరిష్కరిస్తామని, 3 గంటల కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నాడు.. పది హెచ్‌పీ మోటార్లు పెట్టాలంటున్నాడు. రా ష్ట్రంలో 30 లక్షల బోర్లకు రూ. 30 వేల కోట్లు ఖర్చు చేయాలి.. వాళ్ల అయ్య కొనిస్తడా అంటూ కేసీఆర్ మండిపడ్డారు. ఽరైతు బంధును క్రమక్రమంగా పెంచుతామన్నారు. రైతుబంధు ఉండాల వద్దా.. అంటూ కేసీఆర్ అడుగగా ప్రజలు కావాలని నినదించా రు. పింఛన్లు తీసుకుంటున్న వారంతా పేదలేనన్నా రు. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ రూ. 2 వేలను రూ.5 వేలకు పెంచుతామన్నారు. గల్ఫ్‌లో ఉన్న కార్మికులకు కూడా బీమా వర్తింపజేస్తామన్నారు.
ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి..
రాష్ట్రం ఏర్పడి బీఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ముఖ్యంగా రైతు బాగుండాలని రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ అమలు చేశామన్నారు. వ్యవసా య స్థిరీకరణ చేసి, నీటిపన్ను రద్దు చేశామన్నారు. దేశంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణానేన్నారు. గతంలో ఉన్న రూ. 200 పింఛన్‌ను ప్రస్తుతం 2000కు పెంచామన్నారు. ఐటీలో త్వరలోనే బెంగుళూరును దాటేస్తామన్నా రు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని, బీడీకార్మికులకు పింఛను ఇస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో డయాలసిస్ పేషంట్లకు రూ. 2వేలు పింఛన్ అందిస్తున్నామన్నారు.
3 వేల ఎకరాల పోడుభూమి పంపిణీ!
రూరల్ నియోజకవర్గంలో గిరిజనులు (లంబాడాలు) అధికంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. 50 తండాలను గ్రామ పంచాయతీలు గా మార్చామని, వాళ్ల పాలన వాళ్లే చేసుకుంటున్నారన్నారు. 3 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశామని, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ ర్ధన్ చెప్పినట్లు మిగిలిపోయిన కొంతమందికి ప్రభు త్వం రాగానే పట్టాలు అందజేస్తామన్నారు.
కార్యక్రమంలో ఎంపీ సురేష్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనచారి, జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జి వీజీగౌడ్, ఐసీడీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్, నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి, జెడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, సుమలత గోపాల్‌రెడ్డి, పి.తనూజ శ్రీనివాస్‌రెడ్డి, కమలనరేష్, ఎంపీపీలు రమేష్‌నాయక్, లత కన్నీరాం, కుంచాల విమలరాజు, అనుషప్రేమ్‌దాస్, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ మంజుల యాదవ్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌రావు, పార్టీ నాయకులు నరాల సుధాక ర్ తదితరులున్నారు.
బాజిరెడ్డి అడిగినవన్నీ నెరవేరుస్తా..
మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూరల్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి అడిగినవన్నీ తప్పకుండా నెరవేరుస్తా నని సీఎం హామీ ఇచ్చారు. బాజిరెడ్డి ప్రజాసమస్యలపై నిరంతరం శ్రమించే మంచి నాయకుడ న్నారు. ఇక్కడ బాజిరెడ్డిని గెలిపిస్తే అక్కడ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.
మంచిప్ప రిజర్వాయర్ త్వరలోనే పూర్తవుతుందని, ఇజ్రాయి ల్ టెక్నాలజీ ద్వారా ప్రతి మూడు ఎకరాలకు పైప్‌లైన్ ద్వారా సాగు నీటిని అందిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టు కింద నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల పంట భూములకు సాగునీరందుతుందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment