షబ్బీర్ అలీకి సీఎం శుభాకాంక్షలు
కామారెడ్డి టౌన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఫోన్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
వచ్చేనెల 2న
మారథాన్ రన్
కామారెడ్డి టౌన్: క్యాన్సర్ వ్యాధిపై ప్రజల లో అవగాహన పెంచడానికి వచ్చేనెల 2న మారథాన్ రన్ పోటీలు నిర్వహించనున్నా రు. ఈ విషయాన్ని పద్మపాణి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సత్యనారాయణ తెలిపారు. శనివా రం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. మొదట చిన్నారులకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి కొ త్త బస్టాండ్ వరకు 3కే రన్ నిర్వహిస్తామని, ఆ తర్వాత వివిధ కేటగిరీలవారీగా 5కే, 10 కే, 21 కిలోమీటర్ల రన్ పోటీలు ఉంటాయని వివరించారు. వివరాలకు 85209 70785, 91605 85578 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అథ్లెటిక్ కోచ్ శివ, ప్రతినిధులు పాల్గొన్నారు.
చేతితో ఎత్తే మరుగుదొడ్లు
లేని జిల్లాగా కామారెడ్డి
కామారెడ్డి అర్బన్: చేతితో మలం ఎత్తే మరుగుదొడ్లు, మ్యాన్‌వల్ స్కావెంజర్లు లేని జిల్లా గా కామారెడ్డిని ప్రకటించారు. ఈ మేరకు జి ల్లా ఎస్సీ సంక్షేమాధికారి రజిత ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర కారం గ్రామాలతో పాటు పురపాలక సంఘాల్లో సర్వే చేయగా చేతితో ఎత్తే మరుగు దొడ్లు లేవని తేలిందని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని కోర గా ప్రజలు, సంస్థల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపారు.
కొనసాగుతున్న
ఇంటర్ ప్రాక్టికల్స్
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం జరిగిన ఇంటర్ పరీక్షలకు 782 మందికిగాను 767 మంది హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 160 మందికిగాను 153 మంది ప్రాక్టికల్స్‌లో పాల్గొన్నారు. మధాహ్నం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 396 మంది విద్యార్థులకుగాను 375 మంది, వొకేషనల్‌లో 240 మందికిగాను 227 మంది హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తనిఖీ చేశారు.
డెయిరీ, లైఫ్‌సైన్స్ పూర్వ విద్యార్థులతో ముఖాముఖి
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సై న్స్ కళాశాలలో శనివారం పూర్వ విద్యార్థుల తో ముఖాముఖి నిర్వహించారు. పూర్వ వి ద్యార్థులు అల్పేస్ పటేల్, లక్ష్మారెడ్డి కార్యక్ర మంలో పాల్గొని తమ అనుభవాలను పంచు కున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిప ల్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ అల్పేస్ ప టేల్ లండన్‌లో సొంత కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. పటేల్, లక్ష్మారెడ్డిలను ప్రిన్సిపల్ సన్మానించా రు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, అకడమిక్ కోఆర్డినేటర్లు విశ్వప్రసాద్, జయప్రకాష్, శ్రీనివాస్‌రావు, రాజ్‌గంభీర్‌రావు త దితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద ఎస్సైపై ఫిర్యాదు
కామారెడ్డి క్రైం: భూమిని వదులుకోకపోతే చంపుతామని ఎస్సైతోపాటు మరికొందరు బెదిరిస్తున్నారని బిచ్కుందకు చెందిన మక్క య్య లలిత, గంగారాం ఆరోపించారు. శని వారం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ బిచ్కుంద శివారు లో ఉన్న తమ భూమిని వదులుకోవాలని కొద్దిరోజులుగా బిచ్కుంద, చిన్న దడ్గి గ్రామాలకు చెందిన సాలె హన్మండ్లు, అతడి కుమారుడు అంజయ్య, విఠల్‌రెడ్డి, హన్మండ్లు బెదిరిస్తున్నారన్నారు. వారికి బిచ్కుంద ఎస్సై మోహన్‌రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. వారంతా కలిసి పలుమార్లు దాడికి వచ్చారని, కులం పేరుతో దుర్భషలాడారని, చంపేస్తామని, కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారని పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
షబ్బీర్ అలీకి సీఎం శుభాకాంక్షలు
షబ్బీర్ అలీకి సీఎం శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment