డీసీసీబీని అగ్రస్థానంలో నిలపాలి
సుభాష్‌నగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) ద్వారా రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందించి రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. డీసీసీబీ పాలకవర్గం, సహకార సంఘాల కాల పరిమితిని ఆరు నెలలు పొడిగించినందుకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రైతుల సంక్షేమానికి కృషి చేయడంతోపాటు అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం బాధ్యతతో పని చేయాలని సీఎం సూచించారని రమేశ్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment