ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పట్టభద్రుల శాసన మండలి స్థానంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా బుధవారం కామారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో కేడర్‌తో సమావేశాలు నిర్వహించనున్నారు.
శాసన మండలి ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానీ, ముఖ్య నేతలు గానీ ప్రచారం నిర్వహించలేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీ ముఖ్య నేతలంతా రంగంలో దిగుతున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా జిల్లాలో రెండు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్‌లో, మధ్యాహ్నం 1.30 గంటలకు బాన్సువాడ పట్టణంలోని ఎస్‌ఎంబీ గార్డెన్‌లో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా సమావేశాలకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు హాజరుకానున్నారు.
సన్నాహక సమావేశానికి తరలిరావాలి
బాన్సువాడ : బాన్సువాడలో బుధవారం నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి కార్యకర్తలు తరలిరావాలని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ కోరారు. మంగళవారం నియోజకవర్గంలోని పొతంగల్, బీర్కూర్, వర్ని, కోటగిరి, నస్రుల్లాబాద్ మండలాల్లో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం మధ్యాహ్నం బాన్సువాడలో నిర్వహించే సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారన్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పవన్, బోయిని శంకర్, యామ రాములు, కాశీరాం, విజయ్‌ప్రకాష్, దాసరి శ్రీనివాస్, ప్రసాద్, ప్రశాంత్, గౌస్ తదితరులు ఉన్నారు.
నేడు కామారెడ్డి, బాన్సువాడలలో సమావేశాలు
హాజరుకానున్న పీసీసీ చీఫ్, జిల్లా మంత్రి
Comments
Please login to add a commentAdd a comment