లైంగిక దాడులు జరగకుండా చూడాలి
● సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి
కామారెడ్డి క్రైం : పాఠశాలల్లో విద్యార్థులపై లైంగిక దాడులు జరగకుండా చూడాలని సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం కా మారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా ఎంపిక చేసి న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు పో క్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో ఏవైనా పోక్సో సంబంధిత ఘటనలు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతారన్నారు. పిల్లల విష యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు బ్యాడ్జీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, యునిసెఫ్‌కు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోని కుట్టి, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీసీపీవో స్రవంతి, సీడబ్ల్యూసీ మెంబర్ స్వర్ణలత, బాల రక్షక్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
తాగునీటి సమస్యపై
దృష్టి సారించండి
కామారెడ్డి క్రైం: వేసవి కాలంలో జిల్లాలో తా గునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్ర ణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.శరత్ సూచించారు. మంగళవా రం జిల్లాకు విచ్చేసిన ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో సమావేశమై పలు అంశాలపై చ ర్చించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉ న్న చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చే యాలన్నారు. అవసరమైతే బోరుబావులను అద్దెకు తీసుకోవాలని సూచించారు.
‘మహిళల భద్రతకు
ప్రాధాన్యత’
కామారెడ్డి క్రైం: మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ఏఎస్పీ నరసింహారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో భరోసా కేంద్రం ప్రారంభమై ఏడాది గడుస్తున్న సందర్భంగా మంగళవారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోక్సో, మహిళలపై అత్యాచారాల కేసులను నియంత్రించడానికి భరోసా కేంద్రం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బాధితులకు అండగా ఉంటున్నామని, న్యాయ సలహాలు, వైద్యం తదితర సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 72 కేసులలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఆర్థికంగా వెనకబడిన 45 కుటుంబాలకు రూ. 10.12 లక్షలు సహాయం అందించామన్నారు. పోక్సో, అత్యాచార కేసుల్లో బాధిత మహిళలు, బాలికలకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తున్న భరోసా కేంద్రం సిబ్బందిని అభినందించారు.
‘మర్యాదపూర్వకంగా మెలగాలి’
కామారెడ్డి టౌన్ : ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని కరీంనగర్ జోన్ ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్ సూచించా రు. మంగళవారం కామారెడ్డి ఆర్టీసీ డిపోలో సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఈడీ పాల్గొన్నారు. సంస్థ ఆ దాయాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నా రు. ప్రమాద రహిత డిపోగా పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఇందిర, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
లైంగిక దాడులు జరగకుండా చూడాలి
లైంగిక దాడులు జరగకుండా చూడాలి
లైంగిక దాడులు జరగకుండా చూడాలి
Comments
Please login to add a commentAdd a comment