లైంగిక దాడులను అరికట్టాలి
కామారెడ్డి క్రైం: పాఠశాలల్లో పిల్లలపై లైంగిక దాడులను అరికట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వారికి శనివారం కలెక్టరేట్‌లో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి అధికారి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీసీపీవో స్రవంతి, సీడబ్ల్యూసీ మెంబర్ స్వర్ణలత, అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్
Comments
Please login to add a commentAdd a comment