సలాబత్‌పూర్ వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు
మద్నూర్: కోళ్లలో వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కోళ్ల రవాణాను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. శనివారం తెలంగాణ –మహారాష్ట్ర సరిహద్దులోని సలాబత్‌పూర్ వద్ద పశుసంవర్ధక శాఖ అధికారులు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. కోళ్ల వాహనాలు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి రాకుండా చెక్‌పోస్ట్‌లోని పశుసంవర్ధక శాఖ, పోలీసు అధికారులు అడ్డుకుంటున్నారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ నుంచి మోపెడ్‌పై అహ్మద్ మియా అనే వ్యాపారి కోళ్లను జుక్కల్ మండలానికి తీసుకెళ్తుండగా సలాబత్‌పూర్ వద్ద అడ్డుకుని తిప్పి పంపించామని పశువైద్య అధికారి వినీత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment