ఖలీల్‌వాడి: నగరంలోని రెండో టౌన్ పీఎస్ పరిధిలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎస్సై యాసిన్ అరాఫత్ బుధవారం తెలిపారు. గాజుల్‌పేట్‌కు చెందిన రణ్‌పాల్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు. బుధవారం ఉదయం తిరిగి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఇంట్లో ఉన్న తులంన్నర బంగారం, రూ. 25 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
పేకాట స్థావరంపై దాడి
సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామ సమీపంలో మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిని బుధవారం పట్టుకున్నట్లు ఎస్సై ఎల్ రామ్ తెలిపారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకొని వారి నుంచి రూ.7550 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment