ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పుల సంఖ్యను పెంచాలి
బోధన్‌టౌన్ : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పుల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ అన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పట్టణంలోని బస్తీ దవాఖానాలో ఫైలేరియాపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రజలకు ఫైలేరియా వ్యాధి (బోధకాలు)పై అవగాహన కల్పి ంచాలని సూచించారు. మార్చి 13, 18, 23 తేదీల్లో డివిజన్‌లో ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో ఫైలేరి యా వ్యాధి నిర్ధారణకు రక్తనమూనాలు సేకరిస్తామన్నారు. ఈసదస్సులో మలేరియా జిల్లా అధికారి తుకారాం రాథోడ్, డిప్యుటీ డీఎంహెచ్‌వో సమత, మెడికల్ ఆఫీసర్స్, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment