రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన జీఎం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి రైల్వే స్టేషన్‌ను రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ బుధవారం తనిఖీ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో రూ. 39.09 కోట్లతో చేపట్టిన పనులను పరిశీలించారు. అలాగే గేట్ నంబర్ 238 వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, సిబ్బందికి సూచనలిచ్చారు. ట్రాక్ భద్రత, వేగ సామర్థ్యం, ప్రయాణికులకు సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. ప్రయాణికులు వేచి ఉండే గదులు, స్టాల్స్, బుకింగ్ కౌంటర్లు, లిఫ్ట్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. స్టేషన్‌లోని సమస్యలను పలువురు జీఎం దృష్టికి తీసుకెళ్లగా.. స్థానిక స్టేషన్ అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో పతకాల పంట
కామారెడ్డి అర్బన్: రాష్ట్రస్థాయి యూత్, ఆల్ ఏజ్ గ్రూప్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యంత ప్రతిభ చూపి బంగారు, కాంస్య పతకాలు సాధించారు. రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మైదానం సింథటిక్‌ట్రాక్‌పై మంగళ, బుధవారాల్లో ఈ పోటీలు నిర్వహించారు. అండర్ –20 విభాగంలో జావెలిన్ త్రోలో బి.ఈశ్వర్‌ప్రసాద్ బంగారు పతకం సాధించగా, అండర్–18 విభాగంలో షాట్‌పుట్‌లో ఎన్.స్పందన కాంస్య పతకం సాధించారని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ తెలిపారు. విజేతలను అసోసియషన్ ప్రతినిధులు అభినందించారు.
నేడు సౌత్‌క్యాంపస్‌లో సెమినార్
భిక్కనూరు: భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో గురువారం జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. ‘యువత.. సామాజిక వ్యాపార వేత్తలు’ అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు సెమినార్ ఇన్‌చార్జి వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో మార్పుల సృష్టికర్తలు, తర్వాతి తరాన్ని ప్రేరేపించడంపై చర్చిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కిష్టారెడ్డి, ఐసీఎస్‌ఎస్‌ఆర్ సౌత్ రీజినల్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ యాదగిరిరావు, సామాజికవేత్త ప్రసన్నకుమార్, రిజిస్ట్రార్ యాదగిరి హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు, యువకులు, వ్యాపారులు సెమినార్‌లో పాల్గొనాలని కోరారు.
నిరంతరాయంగా
విద్యుత్ సరఫరా చేయాలి
కామారెడ్డి క్రైం: నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ నగర్‌లోగల 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ఏసీ, డీసీ కంట్రోల్ ప్యానల్‌లను పరిశీలించారు. అనంతరం ఎస్‌ఈ శ్రావణ్ కుమార్‌తో మాట్లాడి విద్యుత్ సరఫరాకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ కల్యాణ్ చక్రవర్తి, ఏడీఈ కిరణ్ చైతన్య, ఏఈ వెంకటేశ్, డీఈ నాగరాజు, ప్రొటెక్షన్ ఏడీఈ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన జీఎం
రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన జీఎం
Comments
Please login to add a commentAdd a comment