ఖలీల్‌వాడి: నగరంలోని బోర్గాం(పి)లోగల ఓ ఇంట్లోకి గుర్తుతెలియని దుండుగుడు వెళ్లి, మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఎత్తుకెళ్లినట్లు 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన దుండగుడు ఇంట్లోకి వెళ్లి సుంకరి కళావతి అనే మహిళ మెడలో నుంచి తొమ్మిది మాసాల బంగారం ఎత్తుకెళ్లాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పేకాడుతున్న ఆరుగురు అరెస్టు
బోధన్‌టౌన్(బోధన్): పట్టణ శివారులోని ఆటోనగర్ కాలనీలో గురువారం రాత్రి పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ నారాయణ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 10,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 6బైక్‌లు, 5 సెల్‌ఫోన్‌లను సీజ్ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment