పురాతన ఆలయాలను అభివృద్ధి చేయాలి
భిక్కనూరు: కొత్త దేవాలయాలను నిర్మించడం కంటే పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు జీర్ణోద్ధరణ కార్యక్రమాలను చేపట్టాలని తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. బుధవారం బస్వాపూర్‌లో అతిపురాతన ఉమామహేశ్వరాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమంలో స్వామీజీ పాల్గొని భక్తులనుద్దేశించి మాట్లాడారు. రానున్న రోజుల్లో సనాతన ధర్మమే ప్రపంచానికి మార్గదర్శకం చూపిస్తుందన్నారు. అన్ని మతాల వారు సనాతన ధర్మం వైపు వస్తున్నారన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహకుంభమేళాలో ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించటం దీనికి నిదర్శనమన్నారు. సామూహిక వ్రతాలు, పూజలు చేయడం వల్ల సోదరభావం పెంపొందుతుందన్నారు. ప్రపంచమంతా మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తుంటే మన దేశ యువతలో కొందరు పాశ్చాత్య పోకడలకు వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఉమామహేశ్వరాలయం అభివృద్ది కమిటీ చైర్మన్ మద్ద లింగం, ప్రతినిధులు గౌరిగారి రాజిరెడ్డి, చాపత్త స్వామి, సిద్దరాములు, తదితరులు పాల్గొన్నారు.
సనాతన ధర్మమే ప్రపంచానికి
మార్గదర్శి
తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ
Comments
Please login to add a commentAdd a comment