పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి | - | Sakshi
Sakshi News home page

పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి

Published Fri, Feb 21 2025 8:43 AM | Last Updated on Fri, Feb 21 2025 8:39 AM

పందుల

పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి

విద్యుదాఘాతానికి ముగ్గురి బలి

ఒకరిని కాపాడబోయి మరొకరు..

మృతులందరిదీ ఒకే కుటుంబం

ప్రాణాలతో బయటపడ్డ

మరో ఇద్దరు కుటుంబ సభ్యులు

సాటాపూర్‌లో నెలకొన్న విషాదం

రెంజల్‌(బోధన్‌) : విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ము గ్గురు దుర్మరణం పాలైన ఘటన తీవ్ర కలకలం రేపింది. రెంజల్‌ మండలం సాటాపూర్‌లో విషాదం నింపింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. రెంజల్‌ మండలం సాటాపూర్‌ గ్రామానికి చెందిన ఓర్సు గంగారాం(50)కు ఇద్దరు భార్యలు, ము గ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒకే ఇంట్లో ఉండే వీరందరూ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ అనుబంధంగా పందుల పెంపకం చేస్తుంటారు. ఇటీవల పెగడపల్లి, చిన్న మావంది గ్రామాల శివారులోని పంటపొలాల్లోకి పందు లు వస్తున్నాయని రైతులు చెప్పారు. దీంతో వాటిని పట్టుకునేందుకు గురువారం తెల్లవారు జామున ఓర్సు గంగారాం, మొదటి భార్య ఓర్సు బాలమణి (45), కొడుకు ఓర్సు కిషన్‌ (22) మిగతా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. పట్టుకునే క్రమంలో కొన్ని పందులు పంటపొలాల్లోకి చొరబడ్డాయి. వాటి వెనకాలే వెళ్లిన గంగారాం, బాలమణి, కిషన్‌ పొలంలో ఉన్న విద్యుత్‌ తీగ లు తగిలి అక్కడికక్కడే కుప్పకూలారు. ప్రమాదాన్ని గమనించిన మిగతా కుటుంబసభ్యులు ఎక్కడికక్కడ నిలబడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, సీఐ విజయ్‌ బాబు, వెంకట నారాయణ, ఎస్సై మచ్చేందర్‌ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నా రు. పోలీసులే స్వయంగా స్థానికులతో కలిసి మృతదేహాలను బయటికి తీశారు. పోస్టుమార్టం నిమి త్తం జిల్లా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్‌ రెడ్డి తెలిపారు. కాగా, ముగ్గురి మృతికి ట్రాన్స్‌కో నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నా రు. విద్యుత్‌ తీగలు కిందికి వేలాడటంతో పందులను పట్టుకునే క్రమంలో తగిలి మొదట కిషన్‌ మృతిచెందగా, విద్యుత్‌ తీగలు పొలంలో పడటంతో తల్లిదండ్రులు సైతం విద్యుదాఘాతంతో మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పెద్ద దిక్కును కోల్పోయి..

పందుల పెంపకంతో పాటు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవించే పేద కుటుంబం అనాథగా మారింది. విద్యుదాఘాతంతో గంగారాం, బాలమణి, కిషన్‌ మరణించగా మొదటి భార్య కుమారుడు ప్రవీణ్‌, కూతురు యశోద, రెండో భార్య శీల, పిల్లలు కృష్ణ, ప్రేమలత ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ముగ్గురినీ ఒకేసారి కోల్పోవడంతో రోదనలు మిన్నంటాయి. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి1
1/4

పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి

పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి2
2/4

పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి

పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి3
3/4

పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి

పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి4
4/4

పందుల కోసం వెళ్తే.. మృత్యుఒడికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement