వైరస్ కారణంగా పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేల సంఖ్యలో కోళ్లు మూకుమ్మడిగా మృత్యువాత పడుతుండడంతో ఆవేదన చెందుతున్నారు. చాలామంది రైతులు చికెన్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని కోళ్లను పెంచుతున్నారు. కోడి పిల్లలు, దాణా కంపెనీలు సరఫరా చేస్తుంటాయి. మ్యాన్‌పవర్‌తోపాటు మిగతా ఏర్పాట్లు కోళ్ల ఫారాల నిర్వాహకులే చూడాల్సి ఉంటుంది. కోళ్లు చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా మృత్యువాతపడుతుండడంతో పౌల్ట్రీ రైతులకు దిక్కుతోచడం లేదు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని తిర్మలాపూర్‌లో వెయ్యి, కిష్టాపూర్‌లో 2 వేలు, బోర్లంలో 6 వేలు, చించోలి లో 1,500 కోళ్లు మృతిచెందాయి. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో పది రోజుల్లో సుమారు 60 వేల కోళ్లు చనిపోయాయి. వైరస్ కారణంగా కోళ్లు చనిపోతుండడంతో లక్షల రూపాయలు నష్టపోతున్నామని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment