కోళ్లపై వైరస్ దాడి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వారం రోజులక్రితం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో పౌల్ట్రీ రైతులు, వెటర్నరీ అధికారుల సమావేశం జరిగింది. పౌల్ట్రీ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెటర్నరీ అధికారులు వివరించారు. అంతే కాకుండా మహారాష్ట్ర నుంచి కోళ్లు మన జిల్లాలోకి రాకుండా సరిహద్దుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయించారు. జిల్లాలోని సలాబత్‌పూర్‌తో పాటు నిజామాబాద్ జిల్లాలోని సాలూర, కందకుర్తి చెక్‌పోస్టుల వద్ద వెటర్నరీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కోళ్ల ఫారాల్లోకి ఎలాంటి వైరస్‌లు ప్రవేశించకుండా లోడింగ్, అన్‌లోడింగ్, ఇతర అవసరాల నిమిత్తం వచ్చే వాహనాలను, సిబ్బంది వస్తువులను 100 శాతం శానిటైజ్ చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment