చోరీ కేసులో ఇద్దరు రిమాండ్
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని సంగోజివాడి గ్రామంలో ఇటీవల దొంగనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపా రు. సంగోజివాడికి చెందిన దోమకొండ అనిల్, గడ్డం బాలరాజు అనే ఇద్దరు వ్యక్తులు ఈనెల 17, 18తేదీల్లో అదే గ్రామానికి చెందిన గడ్డం రాజవ్వ, గంట రాజశేఖర్, గడ్డం సత్యవ్వ ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టి అనిల్, బాలరాజులను శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 7గ్రాముల బంగారం, 10తులాల వెండి, 300ల నగదు, ఒక సౌండ్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
ఎల్లారెడ్డిలో ఒకరు..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడిన నిందితుడిని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. మెదక్ పట్టణానికి చెందిన జ్ఞాన్‌సింగ్, మరో ఇద్దరు గుజరాతీ వ్యక్తులు గతేడాది డిసెంబర్ 16న మండలంలోని దేవునిపల్లి కొట్టాల గ్రామాల్లో అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు జ్ఞాన్‌సింగ్‌ను పట్టుకొని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. నిందితుడి నుంచి 50 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment