సమర్థవంతంగా సేవలందించాలి
నిజామాబాద్‌అర్బన్: విపత్తుల సమయంలో ఆపద మిత్రలు సమర్థవంతంగా సేవలందించాలని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో శనివారం ఆపద మిత్రల మొదటి విడత శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మరో రెండు దఫాలుగా శిక్షణ అందించి, సుశిక్షితులైన సైనికుల వలే తర్ఫీదునిస్తామన్నారు. తొలి విడత శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లకు త్వరలోనే గుర్తింపు కార్డు, సర్టిఫికెట్లను అందజేస్తామని తెలిపారు. మిగతా రెండు దఫాల శిక్షణ కూడా పూర్తి చేసుకున్న వారికి ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తింపజేస్తారని, సుమారు రూ.10వేల విలువ చేసే విపత్తు నివారణ సహాయ ఉపకరణాలతో కూడిన కిట్ అందజేస్తారని పేర్కొన్నారు. 300 మంది వాలంటీర్లను మూడు బ్యాచ్‌లుగా విభజించి 19 రోజులపాటు వివిధ శాఖల నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రయోగాత్మక శిక్షణ అందించారు. విపత్తుల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment