మాయ కాదు.. అంతా మ్యాజిక్
మోర్తాడ్(బాల్కొండ): కళ్లు మూసి తెరిచేలోపు కళ్లకు కలిగే భ్రమే ఇంద్రజాలం. గ్లాసులో ఉన్న పాలు తగ్గిపోవడం, ఎన్నిసార్లు తాగిన పాలు గ్లాసు నిండుగానే ఉండటం, నోట్ల వాన కురిపించడం లాంటివి ఎన్నో మ్యాజిక్‌తో సాధ్యమవుతున్నాయి. మూఢ నమ్మకాలతో తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్న వారికి సరైన అవగాహన కల్పించడం, పిల్లలకు వినోదం పంచుతూ విజ్ఞానం అందించడం ఇంద్రజాలికుల ప్రధాన లక్ష్యం. మాయా లేదు, మంత్రం లేదు అంతా మ్యాజికే అంటున్నారు మెజీషియన్‌లు. మంత్రాలు, క్షుద్రపూజలు నమ్మే వారి రుగ్మతను దూరం చేసే కళ మ్యాజిక్‌కే దక్కింది. సమాజాన్ని మేలుకొలిపే దిశగా మెజీషియన్లు తమవంతు కృషి చేస్తున్నారు. నేడు ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
నిజామాబాద్ పట్టాభిరామ్‌గా రంగనాథ్...
నేటితరానికి తెలిసిన ఇంద్రజాలికులలో ప్రథముడు పీసీ సర్కార్(సీనియర్), తెలుగునాట ఈ మ్యాజిక్ కళను పరిచయం చేసింది బీవీ పట్టాభిరాం. నిజామాబాద్ పట్టాభిరామ్‌గా కీర్తీ ప్రతిష్టలను ఆర్జిస్తున్నారు జాదు యుగంధర్ రంగనాథ్. రెండు దశాబ్దాలుగా మెజీషియన్‌గా అనేక ప్రదర్శలను ఇచ్చి అందరినీ అలరిస్తూ సమాజాన్ని చైతన్య పరిచేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. పీసీ సర్కార్(సీనియర్) జయంతిని పురస్కరించుకొని ఈ నెల 27న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న పీసీ సర్కార్ పురస్కారానికి రంగనాథ్ ఎంపికయ్యారు.
మూఢ నమ్మకాలపై ప్రజల్లో చైతన్యం
వినోదం, విజ్ఞానాన్ని పంచుతున్న
మెజీషియన్లు
నేడు ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment