క్రైం కార్నర్
రామారెడ్డి: చిన్నారులు ఇద్దరు ఆడుకుంటూ వెళ్లి పంట పొలాలకు వినియోగించే పురుగుల మందు సేవించిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గంగావత్ సంజన (10), గంగావత్ బిందు (7) అక్కా చెల్లెళ్లు. శనివారం తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కు వెళ్లడంతో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారులు పానీయం అనుకుని ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగారు. కాసేపటికే ఇంటికి వచ్చిన తల్లిదండ్రుల ముందు ఇద్దరు వాంతులు చేసుకున్నారు. గ మనించిన తండ్రి గంగావతి మంత్ ఏమైందని పెద్ద కూతురును ప్రశ్నించగా తాము తాగిన డబ్బాను చూపించింది. ఏడేళ్ల బిందుకు మాటలు రావు. వెంటనే 108 కు కాల్ చేసి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చిన్నారులను తరలించారు. చిన్నకూతురు బిందు పరిస్థి తి విషమంగా ఉందని తండా వాసులు తెలిపారు. స్కూల్ తండా ప్రాథమిక పాఠశాలలో సంజన 6వ తరగతి చదువుతోంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజన
వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించిన తల్లిదండ్రులు
క్రైం కార్నర్
Comments
Please login to add a commentAdd a comment